Phalguna Amavasya 2022
ఫాల్గుణ బహుళ అమావాస్య 2022
'ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.