Sri Matangi Devi Shodasopachara Puja Vidhanam in Telugu

Submitted by subhash on Fri, 02/04/2022 - 13:47

ముందుగా దైవ ప్రార్థనతో పూజను ప్రారంభించాలి.

శ్రీ దేవి పూజా ప్రారంభః

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం

ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం నారాయణాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం మాధవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి, పిదప ఆ ఎంగిలి చేతిని కడగాలి )

( నమస్కారము చేస్తూ ఈ క్రింది నామాలు చదవాలి)

ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం హృషీ కేశాయ నమః.
ఓం పద్మ నాభయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం సంకర్షణాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః.
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం జనార్దనాయనమః.
ఓం ఉపేంద్రాయ నమః.
ఓం హరయే నమః.
ఓం శ్రీ కృష్ణాయ నమః.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః .

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.

తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రియుగం స్మరామి.

సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతా రామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహా జనేభ్యో నమః.

భూతోచ్ఛాటన: ( ఈ క్రింది మంత్రము చెప్పి ఆక్షితలను వాసన చూసి వెనుకకు వేయాలి. అందువల్ల మనము చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి )

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః.
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే.

ప్రాణా యామః : తరువాత ప్రాణా యామము చేయాలి. అనగా గాలిని పీల్చి( పూరకము), లోపల బంధించగలిగినంతసేపు బంధించి( కుంభకము ), నెమ్మదిగా బయటకు వదలాలి ( రేచకము ). ఈ ప్రాణాయామము చాలా శక్తి వంతమైనది. మన ఆయుః ప్రమాణం మన రెప్ప పాటులను బట్టీ, ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను బట్టీ, మన నోటి నుండి వచ్చే వర్ణ సంఖ్యను బట్టీ నిర్ణయించ బడుతుంది. ఇన్ని సార్లు గాలి పీల్చి వదలిన పిమ్మట, ఇన్నిసార్లు రెప్పలు మూసి తెరచిన పిమ్మట, ఇన్ని అక్షరాలు పలికిన పిమ్మట వీడి ఆయువు తీరును అని విధిచేత రాయ బడి ఉంటుంది. మన ఆయువు తీరే నాటికి ఆ మూడూ ఒకేసారి పుర్తగును. అందుకే మన ఋషులు గాలిని పీల్చి కుంభకములోనే నిలిపి అనేక సంవత్సరములు రెప్పపాటు లేకుండా, మౌనంగా తపస్సు చేసే వారు. ఆ తపస్సు చేసినంతకాలం వారి ఆయుష్షు నిలచి ఉండేది. ఇంతటి శక్తి ఉంది ప్రాణాయామానికి. మనము అటువంటి తపస్సు చేయక పోయినా రోజూ కొంత సమయం ప్రాణాయామ సాధన చేస్తే ఎటువంటి రోగములనైనా అదుపులో పెట్టుకుని ఆ రోగ్యముతో జీవించ వచ్చును.

సంకల్పం: (భారత దేశంలో ఉండే వారికి, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వారికి మాత్రమే ఈ సంకల్పం పనికి వస్తుంది.)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభనే ముహూర్తే- శ్రీ మహా విష్ణో రాఙయా-ప్రవర్తమానస్య- అద్య బ్రహ్మణః-ద్వితీయ పరార్దే-స్వేతవరాహ కల్పే-వైవస్వత మన్వంతరే-కలియుగే-ప్రథమ పాదే-జంబూ ద్వీపే-భారత వర్షే-భరత ఖండే-మేరోర్దక్షిణ దిగ్భాగే-శ్రీశైలస్య.........ప్రదేశే (హైదరాబాదు-వాయువ్య ప్రదేశం అవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మార్చి చెప్పుకోవాలి) - క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే (ఇది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది)-శోభన గృహే-సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ- అస్మిన్ వర్తమానేన- వ్యావహారిక చాంద్రమానేన- (చాంద్ర మానం ప్రకారం)

....................... సంవత్సరే ( ప్రభవ, విభవ మొ..గు 60 సం. లలో ఏ సంవత్సరమైతే ఆ పేరు పెట్టాలి) (ప్రస్థుతం: విరోధినామ సం..రం )
............ ఆయనే ( ఉత్తరాయణము లేదా దక్షిణాయనము ) (ప్రస్థుతం: దక్షిణాయనం )
......... ఋతౌ ( 6 ఋతువులు- ప్రస్థుతం వర్ష ఋతువు )
............. మాసే ( చైత్రాది 12 మాసాలలో ఏదైతే అది.- ప్రస్థుతం భాద్రపద మాసం )
............ పక్షే ( పక్షాలు రెండు. అవి 1. శుక్ల పక్షం, 2 కృష్ణ పక్షం- ప్రస్థుతం శుక్ల పక్షం )
............ తిథౌ ( పాడ్యమ్యాదిగా 16 తిథులు - ఈరోజు త్రయోదశీ తిథి )
........ వాసరే ( 7 వారాలకీ సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి ) (బుధవారాన్ని-సౌమ్యవారం అంటారు )
........... శుభ నక్షత్రే ( ఇక్కడ ఆరోజు నక్షత్రం పేరు చేర్చాలి.) (ఈరోజు-శ్రవణా నక్షత్రం)
......... శుభ యోగే ( విష్కంభం, ప్రీతి మొ.గు ఇవి 27 యోగాలు ) (ఈరోజు-శోభ యోగం)
.......... శుభ కరణే ( బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుఘ్నం అని ఇవి మొత్తం 11 కరణములు) (ఈరోజు-తైతుల కరణం )

ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ-

శ్రీమాన్ .......... గోత్రః- .......... నామధేయః-

ధర్మ పత్నీ సమేతోహం- ( ఇది ఆడవారు చెప్పుకోనవసరం లెదు )

మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మాతంగీ దేవతా ముద్దిశ్య |
శ్రీ మాతంగీ దేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్వక  శ్రీ మాతంగీ మహావిద్యా పూజాం కరిష్యే ||

(కొంత మంది సంవత్సరే, ఆయనే, ఋతౌ,  మాసే, పక్షే ఇలా చెప్పుకుంటారు. మీ ప్రాంతాన్ని బట్టి చెప్పుకోవచ్చు, లేదంటే పై సంకల్పం సరిపోతుంది.)

శ్రీ మాతంగీ దేవిని ఉద్దేశించి- శ్రీ మాతంగీ దేవి ప్రీతి కొరకు, నాకు శ్రీ మాతంగీ దేవి అనుగ్రహం కలగడం కొరకు-  శ్రీ మాతంగీ దేవి  16 రకాలైన సేవలతో కూడిన పూజను చేయుచున్నాను. 

శ్రీ మాతంగీ దేవి ధ్యానమ్ 

శ్లోకం:||  ధ్యాయేత్ సద్రత్న పీఠే శుకకలపఠితమ శృణ్వంతీం శ్యామలాంగీం
న్యస్తైకాఙ్ఘ్రీం సరోజే శశిశకలధరాం వల్లకీం వాదయంతీం 
కహ్లారాబద్దమాలాం నియమిత విలసచ్చూళికాం రక్తవస్త్రాం 
మాతంగీం శంఖపాత్రామ్ మధుర మధుమదాం చిత్రకోద్భాసిభారామ్ || 

శ్రీ మాతంగీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి || 
(అమ్మవారిని భక్తిగా ధ్యానించాలి)

1.ఆవాహనమ్ 
మంత్రం : హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం|
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ || 

శ్లోకం:|| ఆగచ్చ వరదేదేవీ దైత్యదర్ప వినాశిని
పూజాం గృహాణ సుముఖి సర్వసిద్ధి ప్రదాయిని 

శ్రీ మాతంగీదేవ్యై నమః ఆవాహయామి ఆవాహనార్దే పుష్పాంజలిం సమర్పయామి.
(అమ్మవారిని భక్తిగా ఆవాహన చేయాలి)

2.ఆసనమ్ 
మంత్రం : 
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వమ్ పురుషానహం 

శ్లోకం:|| నవరత్నోజ్వలం దివ్యం నానాశక్తి సమన్వితం 
సింహాసనం ప్రదాస్యామి మహా సింహాసనేశ్వరి | 

శ్రీమాతంగీదేవ్యై నమః నవరత్న ఖచిత దివ్యసింహాసనం సమర్పయామి.
(అమ్మవారి ముందు అక్షతలు ఉంచండి)

2.పాద్యమ్
మంత్రం : 
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం
శియందేవీ ముపాహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం॥ 

శ్లోకం:||  పాద్యం గృహాణ దేవేశి పవిత్ర జల నిర్మతం
పాదయోర్దేవ దేవిత్వం మాం పాహి జగదీశ్వరి ||
శ్రీ మాతంగీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి 
(నీటిని ఉద్దరణితో తీసుకొని అమ్మవారి పాదాలకు చూపించి అరివేణంలో పోయండి)

3.అర్ఘ్య మ్ 
మంత్రం : కాంసోస్మితాం హిరణ్యప్రాకారా మార్తాంజ్వలంతీం
తృప్తాం తర్పయంతీం పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే 

శ్లోకం:|| నువాసిత జలం దేవి నుగంధ కుసుమాన్వితం | 
నమస్తే జగదాధారే అర్ఘ్యం నః ప్రతిగృహ్యతామ్ ||

శ్రీ మాతంగీదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. 
(నీటిని ఉద్దరణితో తీసుకొని అమ్మవారి చేతులకు చూపించి అరివేణంలో పోయండి)

4.ఆచమనమ్ 
మంత్రం : 
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టా ముదారాం
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే 

శ్లోకం:|| సువర్ణ కలశానీతం చందానగరు సంయుతం | 
గృహాణాచమనందేవి మయాదత్తం శుభప్రదే ||
శ్రీ మాతంగీదేవ్యై నమః ముఖే ఆచమనం సమర్పయామి 
(నీటిని ఉద్దరణితో తీసుకొని అమ్మవారి ముఖానికి చూపించి అరివేణంలో పోయండి)

5. పంచామృత స్నానమ్ 

శ్లోకం:  పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం 
పంచామృత మిదం స్నానం గృహాణ సురపూజితే || 

శ్రీ మాతంగీదేవ్యై నమః - పంచామృత స్నానం సమర్పయామి
(ఇక్కడ తెలిపిన విధంగా పంచామృతాలతో ద్రవాన్ని సిద్ధం చేసుకొని ఉద్దరిణతో అమ్మవారికి చూపించి స్నానము చేయిస్తున్నట్టుగా భావించి ఆ పంచామృతాలను తీర్థపాత్రలో వేయండి.)

6.శుద్ధోదక స్నానం
మంత్రం : 
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతి స్తవవృక్షోధ బిల్వః |
తస్యఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ || 

శ్లోకం:  పవిత్రిత జలం దేవి మంత్రైర్వైదిక తాంత్రికైః 
సుగంధవాసితం చైవ స్నానార్థం పరిగృహ్యతాం శ్రీ మాతంగీదేవ్యై నమః శ్రీ మాతంగీదేవ్యై నమః - శుధోదకస్నానం సమర్పయామి||

7.వస్త్రమ్ 
మంత్రం : 
ఉపైతుమాన్దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతో‌స్మిరాష్ట్రే‌స్మిన్ కీర్తిమృద్ధిందదాదుమే 

శ్లోకం:  కౌస్తుభాంబరమంబేదం స్వర్ణాంచల విరాజితం
ముక్తాజాలాన్వితం శోణ కంచుకం తేర్పయామ్యహం 

శ్రీ మాతంగీదేవ్యై నమః - కంచుకప్రావర్ణ పరేధానం సమర్పయామి
వస్త్రాంతే ఆచమనీయం సమర్పయామి॥ 
(అమ్మవారికి నూతన వస్త్రాలనుగాని, అక్షతలనుగాని సమర్పించాలి.)

8.కంఠసూత్రమ్ 
మంత్రం : క్షుత్పిపాసామలాంజ్యేష్ఠా మలక్ష్మీం నాశయామ్యహం
అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణుదమే గృహాత్ || 

శ్లోకం: 
అనేక నిష్కసంపన్నం స్వర్ణసూత్రం వినిర్మితం 
కంఠసూత్రం గృహాణేదం సర్వసౌభాగ్య దాయిని

శ్రీ మాతంగీదేవ్యై నమః కంఠసూత్రం సమర్పయామి 
సమర్పణానంతరం ఆచమనీయం సమర్పయామి ||
(అమ్మవారికి కంఠసూత్రాన్ని గాని, అక్షతలనుగాని సమర్పించాలి.)
(స్నాన, ధూప, దీప సమయములందు ఘంటానాదం చేయాలి.)

8.ఆభరణమ్ 
శ్లోకం:||  అలంకారాన్ మయాదేవి సువర్ణేన వినిర్మితాన్ | 
ప్రీత్యర్థం తవ దేవేశి భూషణం ప్రతిగృహ్యతామ్ ||
శ్రీ మాతంగీదేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి 
(అమ్మవారికి ఆభరణాలనుగాని, అక్షతలనుగాని సమర్పించాలి

9. గంధమ్ 
తస్మాద్యజ్ఞాదితి గంధమ్ :
మంత్రం : గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ || 

శ్లో॥ శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్ విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతామ్
శ్రీ మాతంగీదేవ్యై నమః గంధం ధారయామి. (అమ్మవారికి శ్రీగంధాన్ని సమర్పించాలి.)

10. పుష్పమ్ 
మంత్రం : మనసః కామమాకూతిం వాచస్పత్యమశీమహి
పశూనాగ్ం రూపమన్నస్య మయిశ్రీః శ్రయతాంయశః ||

శ్లో॥ మందారై: పారిజాతైశ్చ చంపకైర్వకుళైశ్శుభైః
కమలైః కరవీరైశ్చ పూజయే జగదంబికే 

శ్రీ మాతంగీదేవ్యై నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి (తరువాత శ్రీ మాతం దేవిని అష్టోత్తర శతనామావళి పఠిస్తూ
అపుష్పాలు లేదా అక్షతలతో పూజించాలి)

శ్రీ మాతంగి అష్టోత్తరశతనామావలీ

1. ఓం శ్రీ మహామత్తమాతఙ్గిన్యై నమః 
2. ఓం శ్రీ సిద్ధిరూపాయై నమః 
3. ఓం శ్రీ యోగిన్యై నమః 
4. ఓం శ్రీ భద్రకాల్యై నమః 
5. ఓం శ్రీ రమాయై నమః 
6. ఓం శ్రీ భవాన్యై నమః 
7. ఓం శ్రీ భయప్రీతిదాయై నమః 
8. ఓం శ్రీ భూతియుక్తాయై నమః
9. ఓం శ్రీ భవారాధితాయై నమః 
10. ఓం శ్రీ భూతిసమ్పత్తికర్యై నమః  
11. ఓం శ్రీ జనాధీశమాత్రే నమః 
12. ఓం శ్రీ ధనాగారదృష్ట్యై నమః
13. ఓం శ్రీ ధనేశార్చితాయై నమః 
14. ఓం శ్రీ ధీవరాయై నమః 
15. ఓం శ్రీ ధీవరాఙ్గ్యై నమః
16. ఓం శ్రీ ప్రకృష్టాయై నమః 
17. ఓం శ్రీ ప్రభారూపిణ్యై నమః 
18. ఓం శ్రీ కామరూపాయై నమః
19. ఓం శ్రీ ప్రహృష్టాయై నమః 
20. ఓం శ్రీ మహాకీర్తిదాయై నమః  
21. ఓం శ్రీ కర్ణనాల్యై నమః 
22. ఓం శ్రీ కాల్యై నమః 
23. ఓం శ్రీ భగాఘోరరూపాయై నమః 
24. ఓం శ్రీ భగాఙ్గ్యై నమః 
25. ఓం శ్రీ భగావాహ్యై నమః 
26. ఓం శ్రీ భగప్రీతిదాయై నమః 
27. ఓం శ్రీ భిమరూపాయై నమః 
28. ఓం శ్రీ భవానీమహాకౌశిక్యై నమః 
29. ఓం శ్రీ కోశపూర్ణాయై నమః 
30. ఓం శ్రీ కిశోర్యై నమః 
31. ఓం శ్రీ కిశోరప్రియానన్దఈహాయై నమః 
32. ఓం శ్రీ మహాకారణాయై నమః 
33. ఓం శ్రీ కారణాయై నమః 
34. ఓం శ్రీ కర్మశీలాయై నమః 
35. ఓం శ్రీ కపాల్యై నమః 
36. ఓం శ్రీ ప్రసిద్ధాయై నమః 
37. ఓం శ్రీ మహాసిద్ధఖణ్డాయై నమః 
38. ఓం శ్రీ మకారప్రియాయై నమః
39. ఓం శ్రీ మానరూపాయై నమః
40. ఓం శ్రీ మహేశ్యై నమః  
41. ఓం శ్రీ మహోల్లాసిన్యై నమః 
42. ఓం శ్రీ లాస్యలీలాలయాఙ్గ్యై నమః 
43. ఓం శ్రీ క్షమాయై నమః 
44. ఓం శ్రీ క్షేమశీలాయై నమః 
45. ఓం శ్రీ క్షపాకారిణ్యై నమః 
46. ఓం శ్రీ అక్షయప్రీతిదాభూతియుక్తాభవాన్యై నమః 
47. ఓం శ్రీ భవారాధితాభూతిసత్యాత్మికాయై నమః 
48. ఓం శ్రీ ప్రభోద్భాసితాయై నమః 
49. ఓం శ్రీ భానుభాస్వత్కరాయై నమః 
50. ఓం శ్రీ చలత్కుణ్డలాయై నమః  
51. ఓం శ్రీ కామినీకాన్తయుక్తాయై నమః 
52. ఓం శ్రీ కపాలాఽచలాయై నమః 
53. ఓం శ్రీ కాలకోద్ధారిణ్యై నమః 
54. ఓం శ్రీ కదమ్బప్రియాయై నమః 
55. ఓం శ్రీ కోటర్యై నమః 
56. ఓం శ్రీ కోటదేహాయై నమః 
57. ఓం శ్రీ క్రమాయై నమః 
58. ఓం శ్రీ కీర్తిదాయై నమః 
59. ఓం శ్రీ కర్ణరూపాయై నమః 
60. ఓం శ్రీ కాక్ష్మ్యై నమః  
61. ఓం శ్రీ క్షమాఙ్యై నమః 
62. ఓం శ్రీ క్షయప్రేమరూపాయై నమః 
63. ఓం శ్రీ క్షపాయై నమః 
64. ఓం శ్రీ క్షయాక్షాయై నమః 
65. ఓం శ్రీ క్షయాహ్వాయై నమః
66. ఓం శ్రీ క్షయప్రాన్తరాయై నమః 
67. ఓం శ్రీ క్షవత్కామిన్యై నమః
68. ఓం శ్రీ క్షారిణ్యై నమః
69. ఓం శ్రీ క్షీరపూషాయై నమః
70. ఓం శ్రీ శివాఙ్గ్యై నమః  
71. ఓం శ్రీ శాకమ్భర్యై నమః 
72. ఓం శ్రీ శాకదేహాయై నమః
73. ఓం శ్రీ మహాశాకయజ్ఞాయై నమః 
74. ఓం శ్రీ ఫలప్రాశకాయై నమః 
75. ఓం శ్రీ శకాహ్వాశకాఖ్యాశకాయై నమః 
76. ఓం శ్రీ శకాక్షాన్తరోషాయై నమః 
77. ఓం శ్రీ సురోషాయై నమః 
78. ఓం శ్రీ సురేఖాయై నమః 
79. ఓం శ్రీ మహాశేషయజ్ఞోపవీతప్రియాయై నమః 
80. ఓం శ్రీ జయన్తీజయాజాగ్రతీయోగ్యరూపాయై నమః  
81. ఓం శ్రీ జయాఙ్గాయై నమః 
82. ఓం శ్రీ జపధ్యానసన్తుష్టసంజ్ఞాయై నమః 
83. ఓం శ్రీ జయప్రాణరూపాయై నమః 
84. ఓం శ్రీ జయస్వర్ణదేహాయై నమః 
85. ఓం శ్రీ జయజ్వాలిన్యై నమః 
86. ఓం శ్రీ యామిన్యై నమః 
87. ఓం శ్రీ యామ్యరూపాయై నమః 
88. ఓం శ్రీ జగన్మాతృరూపాయై నమః 
89. ఓం శ్రీ జగద్రక్షణాయై నమః 
90. ఓం శ్రీ స్వధావౌషడన్తాయై నమః  
91. ఓం శ్రీ విలమ్బావిలమ్బాయై నమః 
92. ఓం శ్రీ షడఙ్గాయై నమః 
93. ఓం శ్రీ మహాలమ్బరూపాసిహస్తాప్దాహారిణ్యై నమః 
94. ఓం శ్రీ మహామఙ్గలాయై నమః 
95. ఓం శ్రీ మఙ్గలప్రేమకీర్త్యై నమః 
96. ఓం శ్రీ నిశుమ్భక్షిదాయై నమః
97. ఓం శ్రీ శుమ్భదర్పత్వహాయై నమః 
98 ఆనన్దబీజాదిస్వరూపాయై నమః 
99. ఓం శ్రీ ముక్తిస్వరూపాయై నమః 
100. ఓం శ్రీ చణ్డముణ్డాపదాయై నమః  
101. ఓం శ్రీ ముఖ్యచణ్డాయై నమః 
102. ఓం శ్రీ ప్రచణ్డాఽప్రచణ్డాయై నమః 
103. ఓం శ్రీ మహాచణ్డవేగాయై నమః 
104. ఓం శ్రీ చలచ్చామరాయై నమః 
105. ఓం శ్రీ చామరాచన్ద్రకీర్త్యై నమః 
106. ఓం శ్రీ సుచామికరాయై నమః 
107. ఓం శ్రీ చిత్రభూషోజ్జ్వలాఙ్గ్యై నమః 
108. ఓం మాతంగ్యై నమః 

|| ఇతి శ్రీ మాతంగి అప్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

11.ధూపమ్ 
మంత్రం: 
కర్దమేన ప్రజాభూతా మయి సంభవకర్దమ
శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీమ్ ||

శ్లో॥ తరునిర్యాస చూర్ణం చ గంధవస్తు సమన్వితం 
హూతాశన శిఖాశుద్ధం భోదేవి ప్రతిగృహ్యతామ్

శ్రీ మాతంగీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి 
(అమ్మవారికి అగరబత్తి/సాంబ్రాణి వెలిగించి సమర్పించాలి)

12. దీపమ్ 
మంత్రం: ఆపస్స జంతుస్నిగ్ధాని, చిక్లీత వసమేగృహే
నిచ దేవీం మాతరం శ్రియం వాసయమేకులే|| 

శ్లో॥ సుప్రకాశో మహాదీప స్సర్వత్ర తిమిరాపహః
సబాహ్యాభ్యంతర జ్యోతిః దీపోయం ప్రతిగృహ్యతామ్ 
శ్రీమాతంగీదేవ్యై నమః దీపం దర్శయామి. 
అనంతరం ఆచమనం సమర్పయామి (అమ్మవారి ముందు నేతిదీపాన్ని వెలిగించాలి)

13. నైవేద్యమ్ 
మంత్రం : అర్దాం పుష్కరిణీం పుష్టిం, పింగళాం పద్మమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ 

శ్లోకం:|| సౌవర్ణ స్థవులి మధ్యే పరమాన్నం సుసంస్థితం 
పంచధా షడ్రసోపేతం గృహాణ పరమేశ్వరి ! -

మంత్రం : ఓం భూర్భువస్సువః | ఓం తథ్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ | సత్యం త్వత్తేన పరిషించామి | అమృతమస్తు! అమృతోపస్తరణమసి || |
శ్రీమాతంగీదేవ్యై నమః || ఓం ప్రాణాయ స్వాహా! ఓం అపానాయ స్వాహా! ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా ||
(పై మంత్రమును లేదా శ్లోకాన్ని పఠిస్తూ నివేదన చేయాలి.)    
శ్రీ మాతంగీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి  | అమృతాపిధానమసి ॥ ఉత్తరాపోశనం సమర్పయామి | హస్త ప్రక్షాళనం సమర్పయామి | ముఖ ప్రక్షాళనం సమర్పయామి | కరోద్వర్తనం సమర్పయామి |  పాద ప్రక్షాళనం సమర్పయామి | శుద్దాచమనం సమర్పయామి|| అని చెబుతూ ఉద్ధరిణతో నీటిని అమ్మవారికి చూపించి పళ్లెంలో వేయాలి.

14. తాంబూలమ్ 
మంత్రం: 
ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం, సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం, జాతవేదో మమావహ॥ 

శ్లోకం:|| కర్పూర నాగవల్లీకం క్రముకభ్రాజితం తధా
ఏలాలవంగ సమ్మిశ్రం తాంబూలం ప్రతిగృహ్యతామ్ 
శ్రీ మాతంగీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. ఆచమనీయం సమరం సమర్పయామి.

15. నీరాజనమ్ 
మంత్రం : 
తా మ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం
ప్రభూతంగావో దాస్యశ్వాన్ విందేయం పురుషానహమ్ || 

శ్లోకం:|| నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితమ్
తేజోరాశి మయాదత్తం గృహాణ దయామయీ

శ్రీ మాతంగీదేవ్యై నమః నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

16. మంత్రపుష్పమ్ 
మంత్రం: 
యశ్శుచిః ప్రయతో భూత్వా హుయా దాద్వమన్వహమ్
శ్రియః పంచదశర్చంచ శ్రీకామ స్సతతం జపేత్ 

శ్లోకం:|| పుష్పాంజలి గృహాణేదమిష్ట సౌభాగ్యదాయిని 
శృతి స్మృతి పురాణాది సర్వవిద్యా స్వరూపిణి || 
దుర్గా సూక్తం :
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:
 
స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:
స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:
 
తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనిం కర్మఫలేషు జుష్టామ్:
దుర్గామ్ దేవీ గ్ మ్ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ:
 
అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్థ్ స్వస్తిభిరితి దుర్గాణి విశ్వా:
పుశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయో:
 
విశ్వాని నో దుర్గహ జాతవేద:సింధున్న నావ దురితాతి పర్-షి
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బొధ్యవితా తనూనామ్
 
పృతనా జిత్ గ్ మ్ సహ మనముగ్రమగ్ని గ్ మ్ హువేమ పరమాథ్ సధస్థా త్
స న: పర్-షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితా త్యగ్ని:
 
ప్రత్నోషి కమిడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్య శ్చ సత్సి
స్వాఞ్చాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభాగమాయ జస్వ
 
గో భిర్జుష్ట మయుజోనిషిక్తం తవేంద్ర విష్ణోరనుసఞ్చరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మా దయన్తామ్
 
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నొ దుర్గి: ప్రచోదయాత్

ఆత్మప్రదక్షిణ నమస్కారం
శ్లో॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి, ప్రదక్షిణ పదేపదే || 
శ్లో|| అన్యధా శరణం, నాస్తిత్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి 
శ్రీ మాతంగీదేవ్యై నమః - ఆత్మప్రదక్షిణ నమస్కారామ్ సమర్పయామి.

పునఃపూజా - ఛత్రాది సమర్పణమ్
శ్రీ మాతంగీదేవ్యై నమః - ఛత్రం సమర్పయామి। చామరం విజయామి। గీతం శ్రావయామి | దర్పణం దర్శయామి | నృత్యం సమర్పయామి | నాట్యం సమర్పయామి॥ సమస్త రాజోపచారాన్ సమర్పయామి | సమస్త దేవోపచారాన్ సమర్పయామి | సమస్త శక్తి భక్త్యుపచారాన్ సమర్పయామి |
(అమ్మవారి ముందు అక్షతలను సమర్పించాలి.)

అపరాధ - క్షమా యాచన 
శ్లో| ఆవాహనం నజానామి న జానామి తవార్చనమ్ |
పూజాం చైవ నజానామి క్షమస్వ పరమేశ్వరి || 
శ్లో| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి|
యత్పూజితం మయా దేవి! పరిపూర్ణం తదస్తు తే || 
శ్రీ మాతంగీదేవ్యై నమః - అపరాధ క్షమాపణం సమర్పయామి॥ 
(అమ్మవారికి నమస్కరించి అపరాధాల్ని క్షమించమని ప్రార్థించాలి)

పూజా సమర్పణమ్ 
శ్లో॥ యస్మ స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు!
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ || 
శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయా దేవి! పరిపూర్ణం తదస్తు తే ||

అనేన మయా యథాజ్ఞానేన యథా మిళితో పచారద్రవ్యైః భక్త్యాకృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన శ్రీ మాతంగీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు||

సర్వం శ్రీ మాతంగీ దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు! 
(అక్షతలు, నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్లెంలో వేయాలి.)

|| ఇతి శ్రీ సూక్తవిధానేన దేవతార్చనమ్ సంపూర్ణమ్ || 
(పై తెలిపిన విధంగా శ్రీ మాతంగీదేవి షోడశోపచార పూజా విధానాన్ని
భక్తిశ్రద్ధలతో తమ శక్త్యానుసారం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు) 

ప్రతిరోజు పూజానంతరం ఈ గ్రంథంలో తెలిపిన విధంగా అమ్మవారికి నైవేద్యంగా- బెల్లంతో చేసిన పరమాన్నం, పాయసం, గారెలు, చక్కెర పొంగలి, పులిహోర ఇవన్నీగానీ లేదా వీటిలో ఏదో ఒకటిగాని నైవేద్యంగా సమర్పించాలి.

 

Meta Title
Sri Matangi Devi Shodasopachara Puja Vidhanam in Telugu
Display Title
శ్రీ మాతంగీ దేవి పూజా విధానం
Image
Sri Matangi Devi Shodasopachara Puja Vidhanam
Deva Categories