Amavasya

Ashwayuja Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 13:00

ఆశ్వయుజ బహుళ అమావాస్య 2022

ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. 

Margashirsha Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:57

మార్గశిర బహుళ అమావాస్య 2022

మార్గశిర  మాసం విష్ణు మూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి  మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం చేయలి.

Kartika Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:55

కార్తీక బహుళ అమావాస్య 2022

కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే కార్తీకస్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. తరువాత శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి.

Polala Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:49

శ్రావణ బహుళ అమావాస్య 2022

శ్రావణ బహుళ అమావాస్యను 'పొలాల అమావాస్య' అంటారు. పొలాల అమావాస్యకు హిందు సాంప్రదాయంలో ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ 'పోలాల అమావాస్య వ్రతం' ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.

Mahalaya Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:51

మహాలయ అమావాస్య  / భాద్రపద బహుళ అమావాస్య 2022

భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ సర్వప్రీతి అమావాస్య అని కూడా అంటారు. పూర్వకాలం నుంచి ఈ రోజును శ్రాద్ధానికి చివరిరోజుగా నమ్ముతారు. ఈ  సర్వ పితృ అమావాస్యనాడు మనకు తెలిసిన, తెలియని పూర్వీకుల కోసం శ్రాద్ధం నిర్వహించడం ప్రత్యేకం. అంటే ముఖ్యంగా తమ బంధువులు ఏరోజు మరణించారో తెలియని వారు ఈ రోజు వారి పేరు మీద తర్పణం లేదా శ్రాద్ధం కూడా చేయవచ్చు. ఈ పర్వదినం రోజున శివున్ని భక్తిశ్రద్దలతో కొలుస్తారు, ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొదుతారాని నమ్మకం ఉంది.

Chukkala Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:47

చుక్కల అమావాస్య / ఆషాఢ బహుళ అమావాస్య 2022

ఆషాఢమాసంలోని చివరరోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు.  ముత్తయిదువలు సంతానాన్ని, సౌభాగ్యాన్ని కోరుతూ ‘చుక్కల అమావాస్య’ నోము నోచుకొంటారు. ఇలా ప్రసిద్ధమైన ‘చుక్కల అమావాస్య’ రోజు సువాసినులు నిష్ఠగా గౌరీపూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. అమ్మవారి ముందు వంద సున్నపు చుక్కలు పెట్టి, వాటిమీద అదే సంఖ్యలో దారపు పోగులు పెడతారు. ఆ పసుపు దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు. స్థోమత ఉన్నవారు బంగారు లేక వెండి చుక్కలను దానం చేస్తారు. ఈ సంఖ్య ఏడాదికి 100 చొప్పున పెరుగుతూ, 5వ సంవత్సరం నాటికి 500కు చేరుతుంది.

Jyeshtha Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:43

జ్యేష్ఠ బహుళ అమావాస్య 2022

సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతం - ‘వటసావిత్రీ వ్రతం’. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమనాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు ఆచరించవచ్చు.    ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతోపాటు రకరకాల దోషాలు, పాపాలు, కష్టనష్టాల నుంచి విముక్తిని పొందుతారు. పూర్వం సావిత్రి కూడా ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించి, తన భర్త అయిన సత్యవంతునుని మృత్యువు నుంచి కాపాడుకోగలిగింది. అటువంటి మహోన్నత శక్తిని కలిగిన ఈ వ్రతాన్ని ఎంతో భక్తశ్రద్ధలతో ఆచరించుకోవాలి.

Vaishakha Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:42

వైశాఖ బహుళ అమావాస్య 2022

సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే  శివుని అనుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుంది. ఆరోగ్యం, ఐశ్యర్యం లభిస్తాయి.

ఈ రోజు శనిజయంతి కూడా కాబట్టి శనిదేవుడిని శాస్త్రోక్తంగా పూజించాలి.  శనిదేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె, నల్ల నువ్వులు తో అభిషేకం చేసి పూజించాలి. మల్లెపూవులు, దీపదానం, నువ్వుల నూనె, బట్టలు ఇతర వస్తువలను దానం చేయాలి. దీంతో శని దేవుడు కరుణిస్తాడు.. ఈ రోజు హనుమాన్ చాలీసా, సుందర కాండ పఠించడం వల్ల శనిదోషం కలుగదు.

Margashira Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:21

మార్గశిర బహుళ అమావాస్య 2022

మార్గశిర  మాసం విష్ణు మూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి  మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం చేయలి.

Chaitra Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:38

Phalguna Amavasya 2022

'Phalguna Amavasya' is considered as the new new moon. It is the last Amavasya of the lunar year. This is followed by the beginning of the new Telugu year. Science says that on this new moon day one should fast and worship Lord Shiva.