Maha Shivaratri 2022 Date Tithi, Muhurta and Puja Time

Submitted by subhash on Tue, 02/08/2022 - 11:57
Maha Shivaratri 2022 Eppudu

శివరాత్రి పర్వదినానికి ఎంతో ప్రత్యేక స్థానముంది. ఉపవాసం, జాగణలతో కలిసి చేసుకునే ఈ పండుగ మిగిలినవాటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ సారి 2022 మార్చి 1న మంగళవారం నాడు జరుపుకుంటారు. శివుడు, పార్వతిదేవి కలయికను జరుపుకునే ఈ పర్వదినం హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైందిగా పరిగణిస్తారు. 

మహా శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి. 
1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.

మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష కాలంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి.

శివరాత్రి తిథి, ముహూర్తం.

2022 మార్చి 1న మంగళవారం చతుర్ధశి తిథి తెల్లవారు జామున 03:16 AM గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 02 అర్థరాత్రి  01:00 AM (అనగా తెల్లవారితే 2 బుధవారం) గంటలకు ముగుస్తుంది.

Maha Shivaratri 2022 Date, Tithi and Muhurta

Date 2022 March 01, Tuesday
Chaturdashi Tithi Begins 03:16 AM on Mar 01, 2022
Chaturdashi Tithi Ends 01:00 AM on Mar 02, 2022
Ratri First Prahar Puja Time 06:28 PM to 09:30 PM, Mar 01
Ratri Second Prahar Puja Time 09:30 PM to 12:32 AM, Mar 02
Ratri Third Prahar Puja Time 12:32 AM to 03:33 AM, Mar 02
Ratri First Prahar Puja Time 03:33 AM to 06:35 AM, Mar 02
Shivaratri Parana Time 06:35 AM, Mar 02 2022, wednesday

మహాశివరాత్రి ప్రాముఖ్యత

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా మాస శివరాత్రి జరుపుకుంటారు. వేసవి రాకముందు శీతాకాలపు చివర్లో(ఫిబ్రవరి లేదా మార్చి) ఏడాదికి ఒక సారి మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి అని అర్థం. ఈ రోజు పరమేశ్వరుడు సృష్టి, సంరక్షణ, విధ్వంస తాండవం చేస్తాడని ప్రతీతి. శివరాత్రి రోజు రాత్రంతా జాగరణ ఉండి శంకరుడిని ఆరాధిస్తారు. ఆయనకు పండ్లు, మిఠాయిలు, ఆకులను అర్పిస్తారు. భక్తులు ఉపవాసముండి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. 

మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఉపవాసం చేసి ఒక్క బిల్వ పత్రాన్నైనా శివుడికి అర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు.

ఈ రోజున ఆలయాల్లో నాలుగు యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. ఇదే సమయంలో నిర్ణీత నైవేద్యంతోపాటు పారాయణం కొనసాగిస్తారు.

తొలి యామం పూజ

పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామరపువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. రుగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.

రెండో యామం పూజ

ఈ పూజలో మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం గంధ లేపనంతో అలంకరించి బిల్వపత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీని వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం కాబట్టి ఈ అభిషేకం వల్ల ఎంతో పుణ్యఫలం.

మూడో యామం పూజ

ఇందులో తేనెతో అభిషేకం చేసి, కర్పూరం గంధ లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నం, నువ్వులు నైవేద్యంగా నివేదించి, సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట.

నాలుగో యామం పూజ

చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పూలు, కర్పూరం గంధ లేపనంతో అలకరించాలి. తామర, కలువ, మల్లె పూలతో అర్చనగావించి, వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అథర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు.

కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనతో రోజంతా మహాశివుణ్ని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రినాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట. అయితే ప్రస్తుతం చాలా మందిని బీపీ, సుగర్ వంటి వ్యాధులు బాధిస్తుండంతో ఎంతో కొంత అల్పాహారం తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది అపవాదమే అయినప్పటికీ తప్పదు.

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి తప్పయిన ఇలాంటి చిన్న చిన్న రోగాలతో బాధపడేవాళ్లు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పళ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకోవచ్చని చెపుతున్నారు.

Meta Title
Maha Shivaratri 2022 Eppudu? Maha Shivaratri 2022 Date Tithi and Puja Time
Display Title
మహా శివరాత్రి 2022 తేదీ, తిథి మరియు పూజ విధానం