కాలెండర్ పేజీ

Chandra Darshanam 2022 Calendar

Submitted by subhash on Wed, 12/22/2021 - 20:31

చంద్ర దర్శనం అమావాస్య రోజు తర్వాత చంద్రుని దర్శనం యొక్క మొదటి రోజు. చంద్ర దర్శనం అనే ప్రత్యేకమైన రోజును అమావాస్య మరునాడు వచ్చే చంద్రుడిని చూడటంతో జరుపుకుంటారు. ఆ రోజు సూర్యాస్తమయం అయిన వెంటనే చంద్రుడిని చూడటం చాలా విశిష్టంగా భావిస్తారు. ఎవరైతే చంద్రదర్శనం సమయంలో చంద్రుడ్ని చూస్తారో , చంద్రదేవుడు వారికి మంచి అదృష్టాన్ని ఆశీర్వాదంగా అందిస్తారని నమ్మకం.

ఈ పండగను పాటించేవారికి సిరిసమృద్ధిలకు లోటు ఉండదని నమ్మకం. హిందువులు ఆరోజున ఉపవాసం ఉంటారు. చంద్రుని దర్శనం అయ్యాక పూజ చేస్తారు. అప్పుడే ఉపవాసం ముగించి ఏమైనా తింటారు.

Skanda Sashti Vratham 2022 Calendar

Submitted by subhash on Wed, 12/22/2021 - 13:43

స్కంధ షష్ఠి 2022 తేదీలు మరియు తిథి సమయం

స్కంధ షష్ఠి పూజ సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ మార్గశిర షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా  పిలుస్తారు. షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ప్రతి నెల వచ్చే శుక్ల పక్ష షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున  భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు లేదా వ్రతం చేసుకుంటారు. స్కంద షష్ఠి వ్రతం కోసం షష్ఠి తిథి, పంచమి తిథి కలిపిన రోజు ప్రాధాన్యతనిస్తుంది. అందుకే స్కంద షష్ఠి వ్రతం పంచమి తిథి నాడు ఆచరించవచ్చు.

Masa Shivaratri Calendar 2022

Submitted by subhash on Wed, 12/22/2021 - 12:51

మాస శివరాత్రి 2022 తేదీలు మరియు తిథి సమయం

ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాస శివ రాత్రి. ప్రతి నెలా వచ్చే మన శివుని పండుగ. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా కృష్ణ పక్షం చతుర్దశి నాడు ఆ భోళా శంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణాలు ప్రత్యేకముగా, విశిష్టముగా ఉంటాయి.అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి అంటే మాఘ మాస శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. 

Amavasya Calendar 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 11:41

2021 అమావాస్య తేదీలు మరియు తిథి సమయం

చాలా మంది అమావాస్య మంచి తిది కాదు అంటుంటారు. కానీ అమావాస్య పూర్ణ తిథి. చతుర్దశి, అష్టమి, ఏకాదశి, అమావాస్య, పూర్ణిమలు మంచి తిథులు. ఇవ్వన్నీ భగవంతుడికి ఇష్టమైన తిదులు. ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం చేయలి.