Ratha Saptami 2022 Date and Puja Vidhanam

Submitted by subhash on Sat, 01/29/2022 - 09:01
Ratha Saptami 2022 Date and Puja Vidhanam

ఈ వ్యాసం లో రథసప్తమి ఎప్పుడు? ఏరోజు జరుపుకోవాలి? పూజ విధానం, ప్రసాదలు గురించి తెలుసుకుందాం.

సుమారు నూటతొంభై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు ఏకచక్రరథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయన అధిరోహించిన రథం కాల చక్రమని అంటారు. అందుకని ఈరోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘ  కాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కాల చక్ర పంచాంగం ప్రకారం సప్తమి తిథి February 07 04:38 AM నుండి  February 08 06:17 AM వరకు ఉంది. February 07 సూర్యోదయానికి సప్తమి  ఉన్నది కనుక  ఫెబ్ 07 న  రథసప్తమి జరుపుకోవాలి.

కొన్ని పంచాంగల ప్రకారం  February 07 07:37 AM నుండి 08 8:18 AM వరకు ఉంది. మరికొన్ని పంచాంగాలు దీనికి దగ్గరగా ఉంటాయి.  వీటి ప్రకారం February 07 సూర్యోదయానికి సప్తమి తిథి లేదు. February 08 సూర్యోదయానికి సప్తమి తిథి ఉన్నది కనుక 08 న రథసప్తమి జరుపుకోవాలి.

ఎందుకు ఈ పంచాంగలలో తేడా ఉంది? ఏరోజు జరుపుకోవాలో తెలుసుకుందాం. 


భారతదేశంలో సుమారు 2వేల సంవత్సరాల నుంచి వెలువడే పంచాంగాలు దృక్, సూర్య సిద్ధాంతాల ఆధారంగా గణించబడుతున్నాయి.  వీటిలో సూర్య సిద్ధాంతం ప్రాచీనమైనది వరాహమిహిరుడు మరియు ఆర్యభట్ట వ్రాశారు. ఈ సిద్దాంతమే అన్నిటికీ మూలం. 

అయితే ఈ సిద్దాంతం ప్రకారం  సంవత్సరానికి సౌరప్రమాణం లేదా సూర్యుని కాలచక్రం 3 నిమిషాల 24 సెకెన్లు తేడా వస్తుంది అని  కేరళ రాష్ట్రానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు1431లో దృక్ గణిత పద్ధతి ని నెలకొల్పాడు. ఇది సూర్య సిద్ధాంతం ప్రామాణికంగా చేసుకుని మార్పు చేసి దృక్ సిద్దాంతం ను నెలకొల్పాడు. ఈ పద్దతినే 1952లో   జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు గుర్తించారు. ఇప్పటికీ ప్రభుత్వం ఈ పద్దతినే గుర్తిస్తుంది. మన దేశంలో ఎక్కువగా ఈ దృక్ సిద్దాంతం ను అనుసరిస్తారు. 

కాబట్టి  దృక్ పంచాంగం ప్రకారం సప్తమి తిథి 

Ratha Sapthami 2021 Date and Tithi Time

Date Monday February 07, 2022
Puja Time 05:06 AM to 06:45 AM
Tithi Time February 07 04:38 AM – February 08 06:17 AM

మేము కూడా ఈ డేట్ నే అనుసరిస్తాము. మీరు మీ ఇష్ట ప్రకారం రథసప్తమి జరుపుకోండి.

రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే వాళ్ళు షష్టి రోజే వ్రతం చేస్తామని సంకల్పించుకోవాలి. ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి ! నమస్తే సూర్యమాతృకే ||

"సప్తాశ్యముల గల ఓ సప్తమీ! నీవు సకల భూతాలకు, లోకాలకు జననివి. సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం. అని ఈ మంత్రం అర్థం.

అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్యనుంచి సూర్యుని దర్శనం చేసుకొని నమస్కరించవలెను.

స్త్రీలు ఈ రోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలతో వివిధ ఫల, పుష్పాలను సేకరించి, సంక్రాంతి గొబ్బెమ్మలు ఎండినవి  తెచ్చి పాలదాలిగా తులసికోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవుపాలను పొంగించి, పొంగలి చేయవలెను. తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ చేసుకోవాలి. వీలయితే అష్టోత్తరాలతో, సహస్ర నామాలతో  చేసుకోండి.  వ్రతం చేసేవాళ్ళు తప్పకుండా వ్రత కథను చదువుకోవాలి. వ్రతం చేయని వాళ్ళు కూడా చదువుకుంటే మంచిది. 

ఈ రోజు సూర్యదేవునికి ప్రసాదంగా  పొంగలిని నివేదించాలి.   పొంగలిని   చిక్కుడు ఆకుల లో పెట్టి  నివేదించాలి . 

వీలయితే ఈ రోజు సూర్యాష్టకం, సూర్య స్తోత్రం పారాయణ చేయండి. ఎంతో శక్తివంతమైన ఆదిత్య హృదయం చదువుకోండి. శ్రీరాముడు ఆదిత్య హృదయం చదవడం వల్లనే సూర్యనారాయణుని అనుగ్రహం పొంది బ్రహ్మ శివుల వరాలు పొందిన రావణుడిని సంహరిచగలిగాడు.

ఈ విధంగా సూర్య ఆరాధన చేయటం వలన ఆయురాగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశ వృద్ధి చెందుతుంది .

Youtube Video ID
euB5RqNPO8M
Meta Title
Ratha Saptami Eppudu | Ratha Saptami 2022 Date and Puja Vidhanam
Display Title
రథసప్తమి ఎప్పుడు? రథసప్తమి పూజ విధానం