Polala Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:49

శ్రావణ బహుళ అమావాస్య 2022

శ్రావణ బహుళ అమావాస్యను 'పొలాల అమావాస్య' అంటారు. పొలాల అమావాస్యకు హిందు సాంప్రదాయంలో ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ 'పోలాల అమావాస్య వ్రతం' ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.

Chukkala Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:47

చుక్కల అమావాస్య / ఆషాఢ బహుళ అమావాస్య 2022

ఆషాఢమాసంలోని చివరరోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు.  ముత్తయిదువలు సంతానాన్ని, సౌభాగ్యాన్ని కోరుతూ ‘చుక్కల అమావాస్య’ నోము నోచుకొంటారు. ఇలా ప్రసిద్ధమైన ‘చుక్కల అమావాస్య’ రోజు సువాసినులు నిష్ఠగా గౌరీపూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. అమ్మవారి ముందు వంద సున్నపు చుక్కలు పెట్టి, వాటిమీద అదే సంఖ్యలో దారపు పోగులు పెడతారు. ఆ పసుపు దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు. స్థోమత ఉన్నవారు బంగారు లేక వెండి చుక్కలను దానం చేస్తారు. ఈ సంఖ్య ఏడాదికి 100 చొప్పున పెరుగుతూ, 5వ సంవత్సరం నాటికి 500కు చేరుతుంది.

Jyeshtha Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:43

జ్యేష్ఠ బహుళ అమావాస్య 2022

సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతం - ‘వటసావిత్రీ వ్రతం’. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమనాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు ఆచరించవచ్చు.    ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతోపాటు రకరకాల దోషాలు, పాపాలు, కష్టనష్టాల నుంచి విముక్తిని పొందుతారు. పూర్వం సావిత్రి కూడా ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించి, తన భర్త అయిన సత్యవంతునుని మృత్యువు నుంచి కాపాడుకోగలిగింది. అటువంటి మహోన్నత శక్తిని కలిగిన ఈ వ్రతాన్ని ఎంతో భక్తశ్రద్ధలతో ఆచరించుకోవాలి.

Vaishakha Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:42

వైశాఖ బహుళ అమావాస్య 2022

సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే  శివుని అనుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుంది. ఆరోగ్యం, ఐశ్యర్యం లభిస్తాయి.

ఈ రోజు శనిజయంతి కూడా కాబట్టి శనిదేవుడిని శాస్త్రోక్తంగా పూజించాలి.  శనిదేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె, నల్ల నువ్వులు తో అభిషేకం చేసి పూజించాలి. మల్లెపూవులు, దీపదానం, నువ్వుల నూనె, బట్టలు ఇతర వస్తువలను దానం చేయాలి. దీంతో శని దేవుడు కరుణిస్తాడు.. ఈ రోజు హనుమాన్ చాలీసా, సుందర కాండ పఠించడం వల్ల శనిదోషం కలుగదు.

Chaitra Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:38

Phalguna Amavasya 2022

'Phalguna Amavasya' is considered as the new new moon. It is the last Amavasya of the lunar year. This is followed by the beginning of the new Telugu year. Science says that on this new moon day one should fast and worship Lord Shiva.

Phalguna Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:36

ఫాల్గుణ బహుళ అమావాస్య 2022

'ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఇక ఈ కొత్త అమావాస్య రోజున  ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.

Magha Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:34

Magha Amavasya 2022

Those who have planetary defects according to the horoscope should perform Panchamritabhishekam to Shiva, Talabhishekam to Shaniswara and Sindoora Samarpana Puja to Anjaneya Swami. Myths say that bathing in the river on the last day of our lunar month, the day of the new moon, is the best. On the day of the Magha new moon, it is said to give fetal offerings and offerings to the ancestral deities. The ancestral gods are satisfied with the patriarchal work done on this day.

Mauni Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:28

మౌని అమావాస్య / పుష్య  బహుళ అమావాస్య 2022

'మౌని అమావాస్య' అంటే మౌనంగా ఉండే అమావాస్య అంటారు. ఈ పర్వదినాన సాధువులు, యోగులు మౌనంగా ఉంటారు. ఇళ్లలో నివసించే మహిళల్లో చాాలా మంది మౌనవ్రతం పాటిస్తారు.  గంగానదిలో స్నానం కూడా ఆచరిస్తారు. గంగానదిలో స్నానం అందరికీ వీలుకాదు. కాబట్టి, ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి, ‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు’ అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదం, వాటి అంశలు స్నానం చేసే నీటిలో చేరుతాయి.

Margashira Amavasya 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 12:21

మార్గశిర బహుళ అమావాస్య 2022

మార్గశిర  మాసం విష్ణు మూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి  మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం చేయలి.

Amavasya Calendar 2022

Submitted by subhash on Thu, 12/09/2021 - 11:41

2021 అమావాస్య తేదీలు మరియు తిథి సమయం

చాలా మంది అమావాస్య మంచి తిది కాదు అంటుంటారు. కానీ అమావాస్య పూర్ణ తిథి. చతుర్దశి, అష్టమి, ఏకాదశి, అమావాస్య, పూర్ణిమలు మంచి తిథులు. ఇవ్వన్నీ భగవంతుడికి ఇష్టమైన తిదులు. ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం చేయలి.